గోవాలో చేసుకున్న పెళ్లి కేవలం సంప్రదాయం కోసమే: సమంత

  • వివాహానంతరం తొలి ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత
  • పెళ్లి ఎక్కువ మంది అతిథుల సమక్షంలో కంఫర్ట్ గా ఉండదు
  • అందుకే వివాహం గోవాలో సంప్రదాయాన్ని గౌరవించడంలో భాగంగా చేసుకున్నాం
కొత్తపెళ్లికూతురు సమంత వివాహానంతరం తొలి ఇంటర్వ్యూను ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా వివాహం ఓ ప్రైవేటు వేడుకగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని తెలిపింది. మనకు బాగా కావాల్సిన వారిని ఆనందంగా ఉండేలా చూసుకోవడం తమ ఇద్దరికీ చాలా ముఖ్యమని చెప్పింది. 'వివాహాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తే మనవారు ఎలా ఫీలవుతున్నారో మనకు తెలియదు. అలా జరగడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే మా వివాహాన్ని పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా గోవాలో చేసుకున్నా'మని చెప్పింది.

 అయితే పెళ్లి కేవలం సంప్రదాయాన్ని గౌరవించడంలో భాగంగా చేసుకున్నామే కానీ, తమ ఇద్దరికీ ఎప్పుడో వివాహమైపోయిందని భావిస్తుంటామని తెలిపింది. ఊహలు, ఆలోచనల్లో తమ వివాహం ఎప్పుడో జరిగిపోయిందని సమంత చెప్పింది. తన కెరీర్ ఉత్సాహంగా సాగేకొద్దీ లక్ష్యాలు తగ్గుతూ వస్తాయని భావించానని, అయితే అలా జరగడం లేదని సమంత చెప్పింది.

కెరీర్ ఆరంభం నుంచి విజయవంతమై ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని చెప్పింది. ఏదో ఒకరోజు సినిమాలకు దూరంగా ఉంటానని కెరీర్ ఆరంభంలో భావించానని, అయితే అలా జరగడం లేదని సమంత చెప్పింది. బ్యాంక్ బ్యాలెన్స్ సంగతి పక్కనపెడితే.. ఉత్తమంగా నటించాలని భావించానని, ఇంతవరకు అలా జరగలేదని సమంత చెప్పింది. అలా ఉత్తమంగా నటించే దిశగా పయనిస్తున్నానని సమంత తెలిపింది. 
Go Back to Shorts
samanta
naga chitanya
marriage
goa
interview

More Telugu News